Header Banner

హైదరాబాదులో భారీ అగ్ని ప్రమాదం! మంటల్లోనే చిక్కుకుపోయిన 30 మంది!

  Sun May 18, 2025 10:35        Others

హైదరాబాద్ లోని మీర్ చౌక్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గుల్జార్‌హౌస్‌ సమీపంలోని ఓ భవనంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా 14 మందిని ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాద బాధితుల్ని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలు ముమ్మరం చేశారు. మరో 30 మందికిపైగా భవనంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దీంతో చార్మినార్ కు వెళ్లే ప్రధాన రహదారులన్నీ మూసేశారు. ఫైర్ సిబ్బంది 10 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.


మరోవైపు నేడు మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా ప్రపంచ సుందరీమణులు ఇవాళ సాయంత్రం సెక్రటేరియట్ ను సందర్శించనున్నారు. దీంతో సెక్రటేరియట్ వద్ద అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ట్యాంక్ బండ్ మీద సండే-ఫండే ఈవెంట్ కు అంతా సిద్ధం చేశారు. ఇక మిస్ వరల్డ్ లకు సంబంధించి డ్రోన్ షో సైతం ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 3గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ట్యాంకుబండ్ పరిసరాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు.



ఇది కూడా చదవండి: ఏపీలో వారందరికీ గుడ్ న్యూస్! చంద్రబాబు కీలక ఆదేశాలు! రూ.12,500 చొప్పున..

 

ఈ క్రమంలోనే భారీ స్థాయిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. వాణిజ్య భవనంగా ఉండటంతో అక్కడ భారీగా స్టాక్ చేసిన వస్తువులు మంటలకు ఆహుతయ్యే అవకాశం ఉంది. మంటల్లో చిక్కుకున్న వారిని బయటికి తెచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్‌ ముమ్మరంగా సాగుతోంది. అంతస్తుల మధ్య చేరలేని స్థితిలో చిక్కుకున్నవారిని క్రేన్లు, ల్యాడర్లు, హైడ్రాలిక్ ఎక్విప్మెంట్‌లతో రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!

 

ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #HyderabadFire #FireAccident #HyderabadNews #BreakingNews #MajorFire